మేనమామ కిరాతకం

మేనమామ కిరాతకం
  • డబ్బు కోసం అక్క కుమార్తె కిడ్నాప్
  •  రక్త సంబంధాన్ని మరచి  ఉసురు తీసిన దుర్మార్గుడు
  •  సహకరించిన భార్య
  •  నిందితుల అరెస్ట్  

బెంగళూరు : ప్రేమాను రాగాలు, రక్త సంబంధాలు మరచిన సొంత మేనమామ డబ్బు కోసం ఏడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చిన సంఘటన నగరంలో సం చలనం సృష్టించింది. భారతీనగర తిమ్మయ్య రోడ్డులో నివాసం ఉంటున్న సల్మాన్ (28) అతని భార్య షబ్రీన్ (25)ను అరెస్టు చేశామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ చెప్పారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరలు సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

నిందితుడు సల్మాన్ తన అక్క చివరి కుమార్తె రితిభ నిస్సార్ (7)ను గొంతు నులిమి హత్య చేశాడు. వివరాలు… సల్మాన్ అక్క భర్త నిషార్ సివిల్ ఇంజినీరు. పదేళ్లుగా దుబాయ్‌లో ఉంటూ భారీగానే ఆస్తులు కూడా బెట్టాడు. నిస్సార్ దంపతులకు నలుగురు పిల్లలు. చివరి అమ్మాయి రితిభ ఇక్కడి అశోక్‌నగరలోని ధనరాజ్ పూల్‌చంద్ హిందీ స్కూల్లో రెండో తరగతి చదువుతోంది. ఇదిలా ఉంటే సల్మాన్ అక్వేరియం చేపలు విక్రయించే వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

బావ దగ్గర ఉన్న డబ్బుపై వ్యామోహం పెంచుకున్న సల్మాన్ ఎలాగైనా అతని వద్ద నుంచి డబ్బు రాబట్టలాని భావిం చాడు. దీని కి భార్య సైతం సహకరిస్తానని చెప్పడంతో చిన్నారి రితిభను కిడ్నాప్ చేసి నగదు డిమాండ్ చేయాలని సల్మాన్ ప్లాన్ వేశాడు. వారం రోజులుగా నిస్సార్ కుటుం బంపై నిఘా పెట్టారు. బుధవారం మధ్యాహ్నం రితిభ చదువుతున్న పాఠశాలకు వెళ్లిన సల్మాన్ భార్య షబ్రీన్, తాను రితిభ పిన్నమ్మగా పరిచయం చేసుకుని రితిభ అవ్వ ఛాతీనొప్పితో ఆస్పత్రిలో చేరిందని బాలికను పం పించాలని కోరింది.

అదే పాఠశాలలో చదువుతున్న రితి భ అక్క రంజాన్ దీక్షలో ఉండటంతో ఆమెకు విషయం చెప్పలేదని టీచర్‌ను నమ్మించింది. అనంతరం బాలికను తీసుకుని అక్కడి నుంచి మాయమైంది.  అప్పటి నుంచి సల్మాన్ తనఅక్క సెల్‌కు రూ. 10 లక్షలు ఇస్తే బాలికను వదిలి పెడతానని ఎస్‌ఎంఎస్ వేయడం మొదలు పెట్టా డు. అయితే ఇదేమి పట్టించుకోని ఆమె మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లగా కుమార్తెను ఓ యువతి తీసుకెళ్లిందని చెప్పడంతో కంగుతింది.

బుర్కా ధరించిన మహిళ వచ్చి తీసుకెళ్లిందని పాఠశాల సిబ్బంది చెప్పడంతో వారు అశోక్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో సల్మాన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఏమీ తెలియని అమాయకుడిలా నటించాడు. అతని వ్యవహార శైలిని అనుమానించిన పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపెట్టాడు. అప్పటికే కిరాతకుడు బాలికను గొంతునులిమి చంపి భారతినగరలోని ఇంటిలో దాచాడు.

తమను గుర్తు పడుతుందని రితిభను హత్య చేశామని సల్మా న్, షబ్రీన్ పోలీసుల ఎదుట అంగీకరించారు. పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి మొబైళ్లు ఫోన్లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నామని ఔరాద్కర్ చెప్పారు. పిల్లలు లేని వీరు  రితిభను ఎంతో అప్యాయంగా చూసుకునేవారని, దత్తతు ఇవ్వాలని కోరేవాడని తమ విచారణలో తేలిందని కమిషనర్ తెలిపారు. డీసీపీ రవికాంత్‌గౌడ నేతృత్వంలో ఏసీపీలు సిద్ధరామయ్య, శోభారాణి ఆధ్వర్యంలోని బృందం నిందితులను అరెస్ట్ చేశారు.