8ఏళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్టు

విజయనగరం, జూలై 31 : ఎనిమిదేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని మంగళవారం టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. స్థానిక అయ్యకొనే రు దక్షిణ గట్టులో నివాసం ఉంటున్న టైలర్‌ వాసు సోమవారం రాత్రి 7.30 గంటలకు స్కూల్‌ డ్రెస్‌ కొలతలు ఇవ్వడానికి వచ్చిన ఎనిమిదేళ్ళ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు. అప్పటికే వాసు మద్యం సేవించి ఉన్నాడని స్థానికులు పేర్కొన్నారు. దీంతో ఆ బాలిక పరుగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి తన అమ్మమ్మతో జరిగిన విషయాన్ని చెప్పడం ఆమె వాసు ఇంటికి వచ్చి దుర్భాషలాడి స్థానికుల సహాయంతో దేహశుద్ధి చేసింది.