8న నల్గొండ కిషన్‌రెడ్డి రాక

నల్గొండ: రైతుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్‌ చేస్తు భాజపా ఆధ్వర్యంలో ఈ నెల 8న కలెక్టర్‌ట్‌ ఎదుట చేపట్టనున్న ధర్నా కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హాజరుకాన్నురని భాజపా కిసాన్‌ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోలి మధుసూధన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర, జిల్లా కార్యదర్శి సాంబయ్య తెలిపారు. విద్యుత్‌ కోతలు, ఎరువుల కొరత, వర్షభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు.