రైల్వే బడ్జెట్ 8న, 10న సాధారణ బడ్జెట్

రైల్వే బడ్జెట్ 8న, 10న సాధారణ బడ్జెట్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వ నేతృత్వంలో పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు జూలై 7 నుంచి ఆగస్టు 14 తేది వరకు జరుగనున్నాయి.
2014-2015 సంవత్సరానికి యూనియన్ బడ్జెట్ జూలై 10 తేదిన,  రైల్వే బడ్జెట్ ను జూలై 8 తేదిన ప్రవేశపెట్టనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆర్ధిక సర్వేను జూలై 9 తేదిన పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు.