రూ.80కి చేరిన ఉల్లి ధర
న్యూఢిల్లీ : బుధవారం ఢిల్లీ మార్కెట్‌లో కేజీ ఉల్లి ధర రూ. 80 పలికింది. బుధవారం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఉల్లిపాయల ధరలు 10 నుంచి 20 రూపాయల వరకూ పెరిగాయి. ఉల్లి ధరను అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో నాఫెడ్ ఈ రోజే గ్లోబల్ టెండర్లను పిలిచింది. ఆసియాలోని అదిపెద్ద ఉల్లి మార్కెట్ మహా రాష్ట్రలోని అసల్ గాప్‌లో బుధవారం హోల్‌సేల్ కేజీ ఉల్లి రూ. 41.25 పలికింది.