ఉద్యోగులపై వెంకయ్యనాయుడు సీరియస్
న్యూఢిల్లీ: నిర్మాణ్ భవన్ లో కేంద్ర పట్టాభివృద్ధిశాఖామంత్రి వెంకయ్యనాయుడు గురువారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేశారు. విధులకు ఉద్యోగులు ఆలస్యంగా హాజరవుతున్నారని సమాచారం అందుకున్న వెంకయ్య నిర్మాణ్ భవన్ లోని అన్ని విభాగాల్లో తనిఖీలు చేశారు.
వెంకయ్య తనిఖీలు నిర్వహించిన సమయంలో ఎక్కువ సీట్లు ఖాళీగా కనిపించాయి. దాంతో ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులకు వెంకయ్య సీరియస్ గా క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. గతంలో కూడా నిర్మాణ్ భవన్ లో వెంకయ్య తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే.