కోల్‌కతా యువతి కిడ్నాప్‌: సామూహిక అత్యాచారం

కోల్‌కతా : సామూహిక అత్యాచారం ఇల్లు అద్దెకు, కొనుగోలుకు తాజా వివరాలు విూకు అందిస్తాం – క్లిక్‌ చేయండి జైపూర్‌: రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపూర్‌లో దారుణం జరిగింది. అజ్మీర్‌ షరీఫ్‌ పవిత్ర క్షేత్రానికి వెళుతున్న ఓ యువతి(22)ని కిడ్నాప్‌ చేసిన నలుగురు వ్యక్తులు, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని కోల్‌కతాకు చెందిన ఆ యువతి ఉద్యోగం కోసమని జులై 28న జైపూర్‌ వచ్చింది. ఇక్కడే ఓ ¬టల్‌లో బస చేసింది. కాగా, ఆమె అజ్మీర్‌ వెళ్లాలని నిర్ణయించుకుని, ఓ టాక్సీలో జులై 30న బయల్దేరింది. అదే సమయంలో ఏడు నుంచి ఎనిమిది మంది దుండగులు ఆమె ప్రయాణిస్తున్న కారును అడ్డగించారు. ఆ తర్వాత ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. ఎవరూ ఉండనటువంటి ఓ పాత ఇంట్లోకి తీసుకెళ్లిన నలుగురు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడరు. అనంతరం దుండగులు పరారయ్యారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, సదర్‌ పోలీసులు గురువారం కేసు నమోదు చేసుకున్నారు. నిందితులలో విక్కీ(25), అశోక్‌(22) అనే ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మిగితా నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.