అప్పు చెల్లించకపోతే షూరిటీదారుడు డిఫాల్టరే

1
హౖదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి) :

సదరు వ్యక్తి అప్పు చెల్లించకపోతే షూరిటీదారుడు కూడా డిఫాల్టరు కిందే లెక్క అని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. బ్యాంకులలో రుణాలు తీసు కొని, ఎగ్గొట్టేవారి ఆట కట్టించేందుకు రిజర్వు బ్యాంకు నిబంధనలను కఠినతరం చేసింది. బకాయి తీసుకున్న వ్యక్తి సకాలంలో చెల్లించకపోతే, అందుకు హావిూగా ఉన్న వ్యక్తిని కూడా డిఫాల్టర్‌గా ప్రకటిస్తారు. ఒక్కసారి

డిఫాల్టర్‌గా ముద్రపడితే ఏ బ్యాంకు కూడా అతనికి లేక ఆమెకు రుణం ఇవ్వదు. బ్యాంకుల రుణ బకాయిలు రాబట్టేందుకు రిజర్వు బ్యాంకు ఈ నిబంధనలు రూపొందించింది. రుణగ్రస్తుల నుంచి రుణం రాబట్టేందుకు బ్యాంకులు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పేద, మధ్యతరగతి వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చి ధనికులకు కచ్చితంగా అమలుచేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది.