సాయంపై కేంద్రం భరోసా : ఈటెల

2

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి) :

తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలుగా సాయం అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ చెప్పారు. విభజన తరవాత ఉన్న సమస్యలను వారికి వివరించామన్నారు. బుధవారం ఢిల్లీలో ఆర్థిక మంత్రుల సమావేశం అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. ఇప్పటికే వివిధ సమస్యలపై సీఎం కేసీఆర్‌ ప్రధానిసహా కేంద్ర మంత్రులకు వివరించారని చెప్పారు. తెలంగాణ వాటా కింద కేంద్రం నుంచి రూ.5,120కోట్లు రావాల్సి వుందన్నారు. ఒకే పన్ను విధానం అమలుచేస్తే ఇబ్బందులు ఉంటాయన్నారు. తెలంగాణలో ఎక్సైజ్‌, పెట్రోల్‌ ఉత్పత్తులపై ఎక్కువ ఆదాయం వస్తోందని, ఇలాంటి ఆదాయాలను జీఎస్‌టీలో కలపబోమని కేంద్రానికి చెప్పామన్నారు. వరి, పొగాకులపై వచ్చే ఆదాయం కూడా జీఎస్‌టీలో కలపబోమని చెప్పామన్నారు. తాము చెప్పిన విషయాలను ఆర్థిక సంఘం తీవ్రంగా పరిగణించాలని కోరుతున్నామని ఈటెల చెప్పారు. కార్యాలయాల్లో కూర్చుని కార్యక్రమాలు రూపొందించవద్దని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. తెలంగాణకు అన్ని విధాలా సహకరించాలని కోరమన్నారు.