ఈ బంధం ధృఢమైనది
భారత్-చైనాల మధ్య బలమైన చారిత్రక, సాంస్కృతిక అనుబంధం
నేటి నుంచి జిన్‌పింగ్ భారత్ పర్యటన
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16 (జనంసాక్షి) : భారత్-చైనాల మధ్య ధృఢమైన బంధం ఉందని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఇది బలమైన చారిత్రాత్మక, సాం స్కృతికమైనదని చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బుధవారం ఇండియాకు రానున్న సందర్భంలో ఢిల్లీలో ఉన్న చైనా జర్నలిస్టులతో ప్రధాని మాట్లాడారు. రెండు దేశాల మధ్య బంధం మరింతగా బలపడాలని, అడుగులు ముందుకు పడాలని కోరుకుంటున్నామని అన్నారు. జిన్‌పింగ్ మూడు రోజుల పర్యటనకు భారత్ వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈ రెండు దేశాల మధ్య బలమైన సాంస్కృతిక బంధం ఉందన్నారు. బలీయమైన చారిత్రక అనుసంధానం ఉందన్నారు. బలీయమైన ధృఢమైన వారసత్వం కారణంగా శాంతికోసం కలసి అడుగులు వేస్తామన్నారు. ప్రపంచ శాంతి లక్ష్యంగా తమ అడుగులు ఉంటాయన్నారు. ఈ రెండు దేశాల జనాభా కలిస్తే ప్రపంచంలో 35శాతం ఉందన్నారు. అంటే 35 శాతం ప్రజలు ఏకమైతే ఫలాలు తమకే దక్కుతాయన్నారు. అంటే ప్రపంచంలో ఎక్కువ శాతం ప్రజలు ఈ అవకాశం కలిగి ఉంటారని అన్నారు. ఓ మరో ప్రపంచం కోసం రెండు దేశాలు గట్టిగా ప్రయత్నం చేస్తాయని అన్నారు. జిన్‌పింగ్ నేతృత్వంలో అత్యున్నత బృందం బుధవారం భారత్ చేరుకోనుంది. వీరు నేరుగా అహ్మదాబాద్ రానున్నారు. అక్కడ ప్రధాని మోడీ వారికి స్వాగతం పలుకుతారు. భారత పర్యటనలో భాగంగా తొలిరోజైన బుధవారం గుజరాత్‌కు రానున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు స్థానిక వంటకాలతో స్వాగతం పలుకుతారు. అహ్మదాబాద్‌లోని రివర్‌ఫ్రంట్ గార్డెన్‌లో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, దీనికి ప్రధాని మోడీ, సీఎంతోపాటు అత్యంత ముఖ్యులైన 22 మందికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించటంతోపాటు జిన్‌పింగ్ పలు కార్యక్రమాల్లో పాల్గొని.. సాయంత్రం ఏడున్నరకు ఢిల్లీకి బయల్దేరుతారని చెప్పారు. ఓవైపు భారత్, చైనా దేశాధినేతలు చర్చల పక్రియలో ముందుకు వెళ్లటానికి సిద్ధమవుతుంటే.. మరోవైపు ఇరుదేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇరుదేశాల సరిహద్దుకు సవిూపంలో ఉన్న దెమ్‌చోక్ గ్రామంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవటానికి చైనీయులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు.భారత విదేశాంగ విధానాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. విదేశీ పర్యటనలు, సమావేశాలకు సంబంధించి పెద్దగా పూర్వానుభవం లేకపోయినా- నిర్దేశిరచుకున్న విధంగా ముందుకు సాగుతున్నారు. సుహృద్భావ వాతావరణాన్ని మరింత విస్తరింపజేసే క్రమంలో-ఆసియా ప్రాంతానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చల పక్రియను అమెరికాతో కలిసి మరింత ముమ్మరం చేయాలని మోడీ నిర్ణయించుకున్నారు. భారత్-చైనాల మధ్య ఈ ఏడాది జూన్-జులైల్లో మూడు అతిపెద్ద ఒప్పందాలు కుదిరాయి. మోడీ అధికార పగ్గాలు చేపట్టిన వెన్వెంటనే చైనాతో కుదిరిన ఈ ఒప్పందాలు- ఉభయ దేశాల సంబంధాలకు శుభారంభం పలికాయి. సరిహద్దుల్లో చైనా సైనికులు మరో చొరబాటుకు సిద్ధపడుతున్నారన్న నివేదికలూ కలవరం కలిగించేవే. . సరిహద్దు వివాదాలు, అంతర్జాతీయ ఉగ్రవాదం వంటి విషయాల్లోనూ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అనుకూలంగా స్పందించారు. ఆసియా మౌలిక సౌకర్యాల పెట్టుబడి బ్యాంకు(ఏఐఐబీ)లో వ్యవస్థాపక సభ్యదేశంగా చేరాలనీ భారత్‌కు చినా ఆహ్వానం పలికింది. ఈ ఏడాది నవంబరులో చైనాలో జరగబోయే ఆసియా పసిఫిక్ ఆర్థిక సమావేశంలో పాల్గొనాలని కూడా జిన్ పింగ్ భారత ప్రధాని మోడీకి సాదర ఆహ్వానం పలికారు. కొంతకాలం క్రితంవరకూ భారత్‌ను చైనా కేవలం దక్షిణాసియాకు పరిమితమైన ప్రాంతీయ శక్తిగానే పరిగణించింది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను ప్రబలశక్తిగా చైనా గుర్తిస్తోంది. చైనాలో పర్యటించాలని మోడీని జిన్ పింగ్ బ్రెజిల్ సమావేశాల సందర్భంగా ఆహ్వానించారు. అందుకు ప్రతిస్పందిస్తూ తొలుత జిన్ పింగ్ భారత్‌ను సందర్శించాలని మోడీ అభ్యర్థించారు. అందులో భాగంగానే చైనా అధ్యక్షుడి ప్రస్తుత పర్యటన ఖరారైంది. ఉభయపక్షాల సమావేశాన్ని యావత్ ప్రపంచం ఆసక్తిగా పరికిస్తోంది.
భారత్‌లో భారీ పెట్టుబడులకు జపాన్ ముందుకువచ్చినందువల్ల- అంతకుమించి పెట్టుబడులను ప్రకటించాలని బీజింగ్ నాయకత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుత పర్యటన సందర్భంగా భారత్‌తో సుమారు 40ఎంఓయూలను కుదుర్చుకునేందుకు చైనా నాయకత్వం సిద్ధపడుతోందని వార్తలు వెలువడుతున్నాయి. మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ జన్మదినమైన సెప్టెంబర్ 17న గుజరాత్‌కు వెళ్లాలన్న జిన్‌పింగ్ నిర్ణయం సాధారణమైంది కాదు. భారత్‌తో సరిహద్దు వివాదాలను శాశ్వతం గా కొనసాగించడంవల్ల చినాకు నిజానికి ఒరిగేదేవిూ లేదు. చైనా అధ్యక్షుడి రాకపట్ల భారత్ సైతం అత్యంత ఉత్సాహంగా ఉంది. జిన్‌పింగ్ పర్యటన భారత, చైనాల సంబంధాలను గుణాత్మకంగా మార్చివేస్తుందని భారత వాణ ిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించడమే అందుకు నిదర్శనం.