ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం

nz8o7fl2
ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల పతకాల పంట

ఇంచియాన్ : ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు పతకాల పంట పండించారు. ఆర్చరీలో భారత్ చరిత్ర సృష్టించింది. ఒకే రోజు ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్య పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు భారత ఆర్చర్లు. పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం రాగా, పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో రజతం వచ్చింది. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌తో పాటు వ్యక్తిగత విభాగంలో త్రిషకు కాంస్యం వచ్చింది.

ఆర్చరీ విభాగంలో భారత్ బంగారు పతకాన్ని సాధించడం ఇదే తొలిసారి. పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణం సాధించింది. దక్షిణ కొరియాపై 227 – 225 పాయింట్ల తేడాత్ భారత్ గెలుపొందింది. ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మకు రజతం వచ్చింది.

మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్‌ఈవెంట్‌లో కాంస్యం దక్కింది. జ్యోతి సురేఖ, త్రిషడే, పూర్వా షిండేలతో కూడిన ఆర్చరీ జట్టు కాంస్యం గెలుచుకుంది. ఆర్చరీ వ్యక్తిగత విభాగంలోత్రిషకు కాంస్యం వచ్చింది.