9వ తరగతి విద్యార్థి కిడ్నాప్‌

విజయవాడ, జూలై 18 : గుడివాడలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి కిడ్నాప్‌కు గురయ్యాడు. రెండు రోజులుగా అతడి ఆచూకి దొరకకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. ధీరజ్‌కుమార్‌ (14) అనే విద్యార్థి సోమవారం యథావిధిగా స్కూల్‌కు వెళ్లి సాయంత్రానికి ఇంటికి రాలేదు. బాలుడి తల్లిదండ్రులు వారి బంధువుల ఇళ్లల్లో, తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. బుధవారం బాలుడి తండ్రి ప్రకాశ్‌రావు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విద్యార్థిని కిడ్నాప్‌ చేసిన కిడ్పాపర్లు ఫోన్‌ చేయడం కానీ, డబ్బు డిమాండ్‌ చేయడం కానీ జరగలేదు. తన కుమారుడిని ఎందుకు కిడ్నాప్‌ చేశారో అంతుపట్టడం లేదని అన్నారు. ప్రత్యేక గాలింపు బృందంచే చర్యలు తీసుకుంటున్నారని పోలీసులు తెలిపారు.