9 మంది డిప్యూటీ తహశిల్దార్లకు పదోన్నతి
ఐదుగురు తహశిల్దార్లకు బదిలీ
శ్రీకాకుళం, జూలై 22 : జిల్లాలో 9 మంది డిప్యూటీ తహశిల్దార్లకు అడహాక్ పదోన్నతులను కల్పిస్తూ జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు మరో ఐదుగురు తహశిల్దార్లను బదిలీ చేశారు. బదిలీ అయిన వారిలో నరసన్నపేటకు చెందిన ఎం.వి.రమణను విశాఖపట్నంకు అలాగే రేగిడి ఆమదాలవలసనుంచి వి.వివేకానందను శ్రీకాకుళం ఎవో ఆర్డీవోకు, కలెక్టరేట్ ల్యాండ్ రిఫార్మ్స్‌కు చెందిన బి.ఆదినారాయణను హిరమండలంకు, శ్రీకాకుళం ఎవో ఆర్డీవో నుంచి డి.రామారావును బూర్జకు బదిలీ చేయగా ఎన్.లక్ష్మణరావు అనే మరో తహశిల్దారు విశాఖపట్నం నుంచి రాజాంకు బదిలీపై వస్తున్నారు.
9 మంది డిప్యూటీ తహశిల్దార్లకు పదోన్నతి