దేశంలో ప్రతి 9 నిమిషాలకు ఒక వివాహతుడి ఆత్మహత్య : భర్తల ప్రాణాలు తీస్తున్న ‘498ఎ’
చెప్పులోని రాయి చెవిలోని జోరీగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు ఇంతింత కాదయ అన్నాడు వేమన మహాకవి, సంసారం కంటే సముద్రం ఈదడం సులువని కూడా చెప్పారు అనుభవజ్ఞులు . అందుకే పెళ్లంటే నూరేళ్ల మంట అంటూ హెచ్చరిస్తుంటారు. ఫ్రాణిగ్రహణం తర్వాత ప్రాబ్లమ్స్ పెరుగుతాయని బ్రహ్మచారులని పెళ్లైన మగాళ్లు ఆటపట్టిస్తుంటారు. హాస్యం మాటెలావున్నా, నిజంగానే పరిణయం మగాళ్ల పాలిట ప్రమాద ఘంటికలు మోగిస్తొంది.మన దేశంలో పెళ్లయినా మగాళ్ల ఆత్మహత్యలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. ప్రతి 9 నిమిషాలకు ఒక వివాహితుడు బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు జాతీయ నేర రికార్డు బ్యూరో తాజా గణాంకాలు వెల్లడించాయి. వివాహిత మహిళల కంటే పురుషులే ఎక్కవ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపింది. 2012 లో వివాహిత పురుషులు 64 వేల మంది ప్రాణాలు తీసుకోగా , 32 వేల మంది మహిళలు ఆత్మహత్యచేసుకున్నారు. మహిళలపై జరుగుతున్న గృహహింసను నిరోధించడానికి ప్రభుత్వం తెచ్చిన ఐపీసీ సెక్షన్ 498ఎ మగాళ్ల పట్ల మృత్యుశాసనంగా మారుతుంది. ఈచట్టాన్నిదుర్వినియోగం చేస్తుండగా వివాహిత పురుషుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. భర్త కుటుంబంపై కక్ష సాధించేందుకు ఈ సెక్షన్‌ను కొంత మహిళలు దుర్వినియోగం చేస్తుండడం మగాళ్ల బలవన్మరణాలకు కారణమవుతుందని విశ్లేషకులు అంటున్నారు.తనతో పాటు తన కుటుంబ సభ్యులకు మానసిక క్షోభ ఎదురైన పరిస్థితుల్లో కొందరు భర్తలు ప్రాణాలు తీసుకోవడానికి వెనుకాడడం లేదని విశ్లేషిస్తున్నారు.



