95 శాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలలు

పదవ తరగతి పరీక్షల్లో వేములవాడ మండ లంలో గల 17 జెడ్పీ పాఠశాలల్లో 95 శాతం ఉత్తీర్ణత సాధించాయని ఎంఈఓ నందగిరి రాజేంద్రశర్మ తెలిపారు. గురువారం ప్రకటించిన పరీక్షా ఫలితాలలో మం డలంలోని కోనాయపల్లె జెడ్‌పి పాఠశాల, వేములవాడలోని ఉర్దూ మీడియం పాఠ శాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని పేర్కొన్నారు. కాగా పరీక్షలకు సంబం ధించి గత మూడు నెలలుగా ఆయా పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులకు ఉపాధ్యా యులు ప్రత్యేక క్లాసులు నిర్వహిండమే గాకుండా జిల్లా నుండి ప్రత్యేక టీంలు ఏర్పా టు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక ఉత్తీర్ణతను సాధించడానికి కృషి చేశారని ఎంఈఓ తెలిపారు.