బైకుకు బైకు ఢీకొని రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి
లక్ష్మణ చందా/నిర్మల్: మే 13 (జనం సాక్షి)నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలంలోని రాచాపూర్ గ్రామానికి చెందిన బజారు అనిల్, వయసు 25 రోడ్డు ప్రమాదంలో బైకు బైకు ఢీకొని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం అందాజా ఏడు గంటలకు సమయంలో చిట్యాల సిర్గాపూర్ మధ్య జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనదారులు నిర్మల్ నుండి బైంసా వైపు వెళ్లగా, అక్కడినుండి నిర్మల్ వైపు వస్తున్న అనిల్ బైక్ కు బలంగా ఢీకొట్టడంతో అనిల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఢీ కొట్టిన వాహనదారులు అక్కడి నుండి పరార్ అయినట్టు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య ఉన్నట్లు తెలిపారు.



