ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించకుంటే చర్యలు తప్పవు

తుంగతుర్తి డిసెంబర్ 4 (జనం సాక్షి)
సూర్యాపేట జిల్లా డిఎస్పి, ప్రసన్న కుమార్
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థి ఎన్నికల ప్రవర్తన విధానాలు గుర్తిరిగి తప్పక పాటించాలని సూర్యాపేట జిల్లా డిఎస్పి ప్రసన్నకుమార్ అన్నారు, గురువారం మండల కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తన విధానాలు) పై పోటీ చేసే అభ్యర్థులకు అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.ఎన్నికల సమయంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు, గ్రామాల్లో అనవసరంగా చిన్నచిన్న తగాదాలు జరిగిన ప్రోత్సహించిన వారిపై చట్టరీత్యా చర్యలు తప్పు అన్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో రౌడీ షీటర్ లను గుర్తించామని వారిని బైండోవర్ చేశామని తెలిపారు,ఓటర్లను ప్రలోభపెట్టడం, డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీ జరిపినా అందులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారి అభ్యర్థిత్వాన్ని కూడా రద్దు చేస్తామని అన్నారు, .ప్రచారం సమయంలో అనుమతుల మేరకే మైక్ సెట్లు, వాహనాలు ఉపయోగించాలని, సోషల్ మీడియాలో కూడా ఉద్రిక్తత కలిగించే పోస్టులు పెట్టరాదని హెచ్చరించారు. అర్హులందరూ నిబంధనలు పాటించి ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని సూచించారు. ఎవరైనా గ్రామంలో సమావేశాలు పెట్టాలన్న, పాదయాత్రలు చేయాలన్న ముందస్తుగా అధికారుల అనుమతి తప్పనిసరి అన్నారు, పర్మిషన్ కోసం స్థానికంగా ఉన్న తాసిల్దార్ సంప్రదించాలని అన్నారు, పర్మిషన్ లేకుండా ప్రచారం చేసిన ఫ్లెక్సీలు కట్టిన ప్రభుత్వ కార్యాలయాలపై అభ్యర్థికి సంబంధించిన వ్రాతలు రాసిన, అనుమతులు లేకుండా ప్రైవేటు గృహాల గోడల మీద రాతలు రాసిన చర్యలు తప్పమన్నారు, సోషల్ మీడియా పై పోలీసుల నిగా ఉంటుందని అసభ్యకరమైన విద్వేషకరమైన పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘ ఉంటుందన్నారు, జిల్లాలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని అన్నారు, ఓటింగ్ కేంద్రాల వద్ద టెంటులకు అనుమతి లేదని అన్నారు, ఎన్నికల సహాయ వ్యయ అధికారి ఇందిర మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా నిర్ణయించిన ఖర్చులకు మించి పోటీ చేసే అభ్యర్థి ఎన్నికలలో ఖర్చు చేయరాదని అన్నారు, పోటీ చేసే అభ్యర్థి నిర్దిష్ట నమూనాలతో రోజువారి ఎన్నికల వ్యయాన్ని తెలిపే రికార్డును తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు, ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజుల లోపల పోటీ చేసిన ప్రతి అభ్యర్థి తన మొత్తం ఎన్నికల ఖర్చుల వివరాలను స్థానిక ఎంపీడీవోకి సమర్పించాలని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పై అభ్యర్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ దయానందం, ఎంపీడీవో శేషు కుమార్, సీఐ నరసింహారావు, ఎస్సై క్రాంతి కుమార్ తో పాటు వివిధ గ్రామాలలో పోటీచేసే సర్పంచ్ అభ్యర్థులు వార్డు సభ్యుల అభ్యర్థులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.



