ప్రజలకు మెరుగైన వైద్య సేవలే ధ్యేయంగా అంబులెన్స్ లు ప్రారంభించిన: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

 

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ వైద్యశాలలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి రెండు అంబులెన్స్ లు ఎమ్మెల్యే డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి ఎస్ ఆర్ నిధులతో ఈరోజు రెండు 108 వాహనాలను అందుబాటులోకి తేవడం జరిగిందని ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి ఎలా చేయాలో తెలుసుకోవడానికి కోటపల్లి ,చెన్నూరు ఆయా మండలాలలో మారుమూల గ్రామాలను తిరిగి వారి స్థితిగతులను చూసి నియోజకవర్గం చాలా వెనుకబడి ఉందని సరియైన రవాణా లేదని ఆలోచనతో ఆంబులెన్స్ లు ప్రారంభించడం జరుగుతుందని చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి మండలాల ప్రజలు వైద్య సేవల కొరకు వాహనాలను ఉపయోగించుకోవాలని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన గిల్డ, వైద్యులు సత్యనారాయణ, అరుణశ్రీ ,వైద్య సిబ్బంది కాంగ్రెస్ నాయకులు సూర్యనారాయణ, మహేశ్వర తివారి నాయకులు హేమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.