కల్దుర్కి అంగన్వాడి కేంద్రంలో అన్యువల్ డే వేడుకలు

బోధన్,  ( జనంసాక్షి ) : బోధన్ మండలం కల్దుర్కి అంగన్వాడి కేంద్రంలో బుధవారం అంగన్వాడి టీచర్ వత్సల ఆధ్వర్యంలో అన్యువల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థులకు ప్రతిభ కార్డులను అందించడంతో పాటు తల్లులకు చిరుధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. పరిసరాలలో దొరికే తాజా ఆకుకూరలు, కూరగాయలు తినాలని, పోషక విలువలు కలిగిన ఆహారం ప్రతిరోజూ తీసుకోవాలని చెప్పటం జరిగింది. గర్భిణీ గర్భం దాల్చిన రోజు నుండి బిడ్డ పుట్టిన 2 సంవత్సర లోపు1000 రోజులు గోల్డెన్ డేస్ గురించి చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ వత్సల, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.