భారత సైనిక దళంలో అగ్నివీర్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం

మహబూబాబాద్ , (జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్దులకు తెలియ జేయునది ఏమనగా, సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన అర్హులైన యువకుల కోసం 2025-26 సంవత్సరానికి సంబంధించి అగ్నివీర్ నియామక డ్రైవ్ నిర్వహించబడనుందని జిల్లా ఉపాధి అధికారి టి రజిత నేడు ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నిపథ్ పథకంలో భాగంగా వివిధ విభాగాల్లో అగ్నివీర్ నియామకానికి ఆర్మీ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోందని, ఈ నియామకాల్లో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్ మెన్ వర్గాల్లో నియామకాలు జరగనున్నాయని, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు: 12 మార్చి 2025 నుండి 25 ఏప్రిల్ 2025 వరకు పొడిగించబడిందని మరింత సమాచారం కొరకు అభ్యర్దులు ఆర్మీ వెబ్‌సైట్: ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారి పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం, సికింద్రాబాద్ ఫోన్ నం. 040-27740205 లో సంప్రదించగలరన్నారు.

తాజావార్తలు