నేడు అసెంబ్లీ ముట్టడి

 

రాష్ట్రంలోని విద్యాశాఖలో సమగ్ర శిక్ష అభియాన్‌ పథకంలో పనిచేస్తున్న దాదాపు 19 వేల మంది మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ (ఎంటీఎస్‌) ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు వరంగల్‌ వేదికగా తమకు న్యాయం చేస్తామని, బేసిక్‌ పే అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని, ఇంతవరకు హామీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు మల్లేశం మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేసే దాకా ప్రభుత్వంపై నిరసన తెలుపుతామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడి చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

తాజావార్తలు