భారతరత్న బాబాసాహెబ్ అంబేత్కర్ 135 జయంతి

చిలప్ చేడ్, (జనంసాక్షి) : మండల కేంద్రంలో అంబేత్కర్ యువజన సంఘం ఆద్వర్యంలో ఘనంగా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మండల కేంద్ర సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నర్సింలు రిటైర్డ్ ప్రధానోపాద్యాయులు న్యాత సంజీవయ్య పాల్గొన్నారు.ఈ సందర్బంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్నర్సింలు మాట్లాడుతు అంబేత్కర్ గొప్ప నాయకుడు ఒక దర్శినికుడు అని తెలియజేశాడు.సంజీవయ్య మాట్లాడుతు…అంబేత్కర్ గొప్ప సామ్యవాది అని తెలియజేశాడు అలాగే మండలంలోని చిట్కూల్ చండూర్ బండ పోతుగల్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బడుగు బలహీన వర్గాల నాయకులు వారు మాట్లాడుతూ మాట్లాడుతు అంబేత్కర్ ఒక్క గొప్ప రాజ్యంగా నిర్మాత ప్రపంచ మేధావి భారత తొలి న్యాయశాఖ మంత్రి ఇలా తన గురించి చెప్పుకుంటూ పోతే అనేక డిగ్రీలు పట్టా పొందిన మహా మేధావి అతని అడుగుజాడల్లో తన ఆలోచనలు అనుగుణంగా మన యువతరం అడుగులు వేయాలని తన ఆశయాలకు అనుగుణంగా అట్టడుగు వర్గాలకు న్యాయం జరిగినప్పుడే తన ఆత్మ శాంతి చేకూరుతుందని ఆనాడే చెప్పిన మహానీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు తను రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకొని ముందుకు సాగినప్పుడే రాజ్యాంగానికి ఒక విలువ ఉంటుందని చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రంలో యువ నాయకులు న్యాత శ్రీనివాస్, భూమయ్య, ఖలీల్,సుబాష్,నందు,భూపాల్, సత్యనారాయణ,తదితరులు పాల్గోన్నారు.