దీర్ఘకాలిక భూ సమస్యలు శాశ్వత పరిష్కారానికి భూ భారతి: కలెక్టర్ ప్రదీక్ జైన్

మోమిన్ పేట (జనం సాక్షి): దీర్ఘకాలిక భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి ఎంతగానో దోహద పడుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం మోమిన్ పేట మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ. రైతులకు తమ భూముల విషయంలో ఉన్న అభద్రత భావాన్ని తావు నీయకుండాజవాబుదారుతనాన్ని పెంచేందుకు భూ భారతి నూతన చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ తెలిపారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, ముటేషన్, నిషేధిత భూములు, ఆర్ ఓ ఆర్ మార్పులు చేర్పులు, సాదా బైనామాలు వంటి సేవలు సులభతరం అవుతుందని ఆయన తెలిపారు.ప్రభుత్వం ప్రజలకు సరళంగా ఉండే విధంగా గ్రామీణ ప్రజల, రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేలా భూ భారతి రూపొందించడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరగకుండా గ్రామాల్లోకి ప్రజలు దగ్గరకు అధికారులు వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఉన్న అసైన్మెంట్, సాదా బైనమాలు, పాసు పుస్తకాలలోని సమస్యలను పరిష్కరించేందుకు కొత్త ఆర్ఓఆర్ చట్టం ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ, గిరిజన ప్రజల భూ సమస్యలు పరిష్కరించినట్లయితే ప్రభుత్వ పథకాలైన రైతు బీమా, రైతు భరోసా ద్వారా లబ్ది పొందుతారని ఆ దిశగా పని చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రైతులు సమస్యలను తెలుసుకునేందుకు తహసిల్దార్ కార్యాలయల్లో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి అధికారులను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. జూన్ 2వ తేదీ నుండి నూతన చట్టం భూభారతి పోర్టల్ ద్వారా భూ సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తామని కలెక్టర్ తెలిపారు.అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. వసతి గృహంలో చేపట్టిన మరమ్మతుల పనులను కలెక్టర్ పరిశీలించారు. సామాగ్రి నిల్వ గదిలో ఉన్న బియ్యాన్ని పరిశీలించి నాణ్యత పై వసతి గృహ సంక్షేమ అధికారిని అడిగితెలుసుకున్నారుఅవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ఆర్డీఓ వాసు చంద్ర, తహసిల్దార్ మనోహర్ చక్రవర్తి, ఎంపీడీఓ విజయలక్ష్మి, డిసిసిబి డైరెక్టర్ పి అంజిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డితో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

తాజావార్తలు