బిర్యానీ సగర్వంగా టాప్ 10లో స్థానం
హైదరాబాదీ బిర్యానీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుడ్ లవర్స్‌ని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంది. మన బిర్యానీ రుచి, సువాసన, ప్రత్యేక వంట విధానం దీన్ని స్పెషల్ గా నిలుపుతోంది. ఇప్పుడు అదే బిర్యానీకి అంతర్జాతీయ వేదికపై మరో గొప్ప గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాత ఆన్‌లైన్ ఫుడ్ & ట్రావెల్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ ప్రకటించిన 2025 జాబితాలో హైదరాబాదీ
సంపాదించింది.
కాగా టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన టాప్ 50 బెస్ట్ రైస్ డిషెస్ జాబితాలో భారత్ నుండి చోటు దక్కిన ఒకే ఒక్క వంటకం హైదరాబాదీ బిర్యానీ కావడం గమనార్హం. అంతేకాకుండా 10వ స్థానంలో నిలవడం భారతీయ వంటకాల ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ ర్యాంకింగ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత చెఫ్‌లు, ఫుడ్ క్రిటిక్స్, పర్యాటకులు, కులినరీ నిపుణులు అందించిన రివ్యూలు, రేటింగ్స్‌ను ఆధారంగా తీసుకున్నారు.భారత్‌లో లక్నో, కశ్మీరీ, కోల్‌కతా వంటి ఎన్నో ప్రసిద్ధ బిర్యానీలు ఉన్నప్పటికీ.. వాటన్నింటినీ వెనక్కి నెట్టి హైదరాబాదీ బిర్యానీ అగ్రగామిగా నిలిచింది. అంతటి పోటీలో కూడా హైదరాబాదీ బిర్యానీ 10వ స్థానాన్ని కైవసం చేసుకోవడం దాని ఖ్యాతిని ప్రపంచానికి మరోసారి రుజువు చేసిందని అంటున్నారు. ఇదే జాబితాలో ఇరాన్‌కు చెందిన మరో బిర్యానీ వంటకం కూడా స్థానం సంపాదించడం ఆసక్తిగా మారింది. ఇక హైదరాబాద్ బిర్యానీ దేశంలోని ఇతర ప్రాంతాలలో తయారయ్యే బిర్యానీలతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో మాంసం, బియ్యాన్ని మసాలాలతో కలిపి ఒకేసారి వండుతారు.



