ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్
బోధన్, (జనంసాక్షి) : సాలూర మండలం తగ్గెల్లి గ్రామంలో బుధవారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ చీల శంకర్ చేతుల మీదుగా. ఈ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు దళారుల నమ్మి మోసపోకుండా ఉండేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు తినడానికి ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ రకంకు 2320 రూపాయలు, సాధారణ గ్రేడుకు 2300 రూపాయలను అందిస్తుందని అందువల్ల రైతులు ప్రభుత్వం అందించే గిట్టుబాటు ధరను పొందాలని ఆయన కోరారు. రైతులు మెరుగైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించే అధికారులకు సహకరించాలని చైర్మన్ చీల శంకర్ కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నరేందర్ రెడ్డి, సాలూర సహకార సంఘం చైర్మన్ అల్లె జనార్ధన్, దేవ్ రావు, మానిక్ రావు, అంబదాస్, విఠల్, గుండారి లక్ష్మీబాయి, స్వప్న, ఐకెపి ఎపిఎం సాయిలు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.