బిఆర్ఎస్ నేతలు పద్ధతి మార్చుకోవాలి
మహబూబాబాద్ , (జనంసాక్షి): మహబూబాబాద్ బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో శాసన మండలి సభ్యులు తక్కెళ్ళపల్లి రవీందర్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ ఎలుకతుర్తిలో ఈ నెల 27న జరుగు బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ బిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో సమన్వయం లోపించిందని ఎమ్మెల్సీ రవీందర్ రావు ఆరోపించారు. కలిసి పనిచేయమని కెసిఆర్ ఆదేశిస్తే సీనియర్ కార్యకర్తలను పట్టించుకోకుండా స్థానిక ఎమ్మెల్సీగా ఉన్న నన్ను ఒక్కసారి కూడా సంప్రదించకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని వారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పై మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమలకు పురుడు పోసిన గడ్డ మానుకోట అని మానుకోట జిల్లాలో ఉన్న ఉద్యమకారులను సీనియర్ నాయకులను పట్టించుకోకుండా బిఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ లు బిఆర్ఎస్ పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డా కార్యకర్తలను పట్టించుకోకుండా విశ్వసిస్తున్నారని ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీలో సమన్వయంతో ముందుకు సాగాలని బిఆర్ఎస్ రజతోత్సవ మహా సభను విజయవంతం చేయాలని వారు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనేక్కి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసాయని ఇప్పుడు తెలంగాణ ప్రజలు కెసిఆర్ కు బ్రహ్మ రథం పడుతున్నారని ఈ నెల 27న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ప్రజలు భారీ ఏత్తున తరలివచ్చే అవకాశాలు ఉన్నాయని సుమారు 15 లక్షల మంది రానున్నారని వారు తెలియజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకు పాలనకు చరమగీతం పాడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు అన్నారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రజతోత్సవ సభకు హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.