ఘనంగా బోనాల పండుగ

జహీరాబాద్ జులై 17 (జనంసాక్షి)

జహీరాబాద్ లోని ఉగ్గేల్లి గ్రామంలో అదేవిధంగా పట్టణంలో వివిధ వార్డులో, ఆషాఢమాసం సందర్భంగా ఆదివారం స్థానిక గ్రామ దేవతలకు మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాల ఉత్సవాలను నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంట కొత్త కుండలకు పసుపు, కుంకుమలు, వేప మండలతో అలంకరించి అందులో పరమాన్నం, పెరుగన్నము, ఆకుకూరలు, పచ్చి పులుసుతో నైవేద్యాన్ని ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు బోనాలను తలపై పెట్టుకొని గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి బోనాలను సమర్పించి నైవేద్య నివేదన చేశారు. గ్రామ దేవతలకు పట్టు వస్త్రాలు, ఎన్నో రకాల సుగంధ సోయగ పుష్పాలు, సౌభాగ్య ద్రవ్యాలు, ఓడి బియ్యాలను సమర్పించి తమ సౌభాగ్యాన్ని చల్లంగ చూడమ్మా అంటూ మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో
డిసీఎంఎస్ చైర్మన్ శివకుమార్,తెరాస మండల అధ్యక్షుడు యం.జి. రాములు,మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప,మాజీ ఆత్మ చైర్మన్ విజయకుమార్,తెరాస యువ నాయకులు మొహమ్మద్ తన్వీర్,మాజీ మున్సిపల్ చైర్మన్ మంకల్ సుభాష్,మాజీ కౌన్సిలర్ లు యూనిస్,నామా రవికిరణ్,మోతిరాం,అబ్దుల్లాహ, ఝంగీర్,
తెరాస సీనియర్ నాయకులు వైజ్యనాథ్,మాజీ పట్టణ అధ్యక్షుడు యకూబ్,
బండి మోహన్,ఇజ్రాయెల్ బాబి,శ్రీకాంత్ రెడ్డి,అరుణ్,నవీన్,
జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ రామకృష్ణ బంటు,వెంకటేశం,వెంకట్,హన్మంతు,చంద్రయ్య,పుణ్యమా,శేఖర్,కృష్ణ,కళ్లెం రవీందర్,గణేష్,చంద్రయ్య ఆలయ ల కమిటీ సభ్యులు ,తదితరులు పాల్గొనారు.