Tuesday, 10 November 2026

హైదరాబాద్

అగస్ట్‌1 నుండి రైతు పోరుబాట:రైతుసంఘం

హైదరాబాద్‌: అగస్ట్‌ ఒకటి నుంచి 8వరకు ఎనిమిది జిల్లాల్లో రైతు పోరుబాట చేపట్టు నున్నట్లు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. అగస్ట్‌ 9న రైతులతో కలసి సచివాలయం ముట్టడిస్తామని అన్నారు. ఒప్పంద వ్యవసాయం రైతులను నష్టాలపాలు…

ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగల అరెస్టు

రాజమండ్రి: ఉభయగోదావరి జిల్లాల్లో 12 కేసుల్లో నిందితులైన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 15లక్షల విలువైన బంగారు ఆభరణాలు, గృహోపకరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వచ్చే 24 గంటల్లో రాష్ట్రవ్వాప్తంగా వర్షాలు

హైదరాబాద్‌ : వచ్చే 24 గంటల్లో రాష్ట్రవ్వాప్తంగా వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారులు తెలిపారు. భూతల ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతల్లో వర్షాలు పడుతున్నట్లు చెప్పారు. ఈ నెలఖరు వరకు రాష్ట్రవ్వాప్తంగా…

దేశంలో పదిశాతి విద్యుత్‌ కొరత ఉంది

హైదరాబాద్‌: ప్రస్తుతం దేశంలో 10 శాతం మేర విద్యుత్‌ కొరత ఉందని సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అధారిటీ ఛైర్మన్‌ అరవింద్‌సింగ్‌ భక్షి పేర్కిన్నారు. దేశీయ విద్యుదుత్పత్తి 70 శాతం బొగ్గుపైనే అధాపడుతోందని ఆయన అన్నారు. భవిష్యత్‌లో సహజ వనరులకు ఇబ్బంది…

ప్రయాణికులను కత్తి పొడిచిన దుండగుడు, ముగ్గురి మృతి

నెల్లూరు: నెల్లూరు జిల్లా తడి వద్ద ఓ ఆర్టీసీ బస్సులో గురువారం తెల్లవారుజామున దారుణ సంఘటన చోటుచేసుకుంది. భద్రాచలం నుంచి చైన్నై వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ దుండగుడు ప్రయాణికులను కత్తితో విచక్షణారహింతంగా పొడిచాడు. ఆర్టీసీ బస్సులో ఓ…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

గుంటూరు: జిల్లాలోని తాడికొండ అడ్డరోడ్డు వద్ద ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ప్రయాణీకులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు

విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణతమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదగా అల్పపీడన  ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. దీంతో కోస్తాంధ్ర, నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. దీంతో కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా…

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

అదిలాబాద్‌: మంచిర్యాల మండలం అర్కే-6 కాలనీలో భార్యాభర్తలు ఈ రోజు తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతోనే వీరు ఆత్మహత్యకు  పాల్పడినట్లు స్థానికులు తెలియజేశారు. పంట నష్టపోయిన కౌలురైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రాసిన  లేఖ సంఘటనాస్థలంలో దొరికింది.

నెల్లూరు ఘటనపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం

నెల్లూరు: తడ సమీపంలో అర్టీసీ బస్సులో ప్రయాణికులపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డీజీపీ దినేష్‌రెడ్డి ఆదేశించారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలకు తక్షణమే సహాయక…

గుర్రాల రేణుక విద్యుత్‌ షాక్‌తో మృతి

మెదక్‌: మెదక్‌ జిల్లా వర్గల్‌ మండలం పాతూరు గ్రామంలో ఈ రోజు ఉదయం విద్యుదాఘాతంతో ఓ యువతి మృతిచెందింది. గుర్రాల రేణుక అనే యువతి ఇంట్లో బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు…