ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతికి అనుమతి
హైదరాబాద్: ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతి నిర్వహిచేందుకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాఠశాలల్లో 8వ తరగతి ప్రారంభించాలంఒటే 40లేదా అంతకన్నా ఎక్కువ మంది విద్యార్థులుండాలి. మూడు కిలో మీటర్ల దూరంలో ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాల లేకుంవడా ఉండాలని నిపుణులు కమిటీ చేసిన ప్రతిపాదనను స్వీకరిస్తున్నట్లు ప్రాథమిక విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి చందనాఖన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాశాఖ సంచాలకులు ఈ మేరకు చర్యలు తీసుకొని ప్రధానోపాధ్యాయులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి 8వ తరగతి వరకు ప్రాథమిక విద్యాశాఖ పర్యవేక్షణ కొనసాగాలి. దీనికి సంబంధించిన చర్యల్లో భాగంగానే ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతిని ప్రారంభించాలని నిర్ణయించారు.