విజయవాడ-జగదల్‌పూర్‌ హైవేలో మార్పులు

ఖమ్మం : విజయవాడ-జగదల్‌పూర్‌ హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో ఆయన విూడియాతో మాట్లాడారు. రహదారుల నిర్మాణంలో కేంద్రానికి పలు ప్రతిపాదనలు పెట్టినట్లు చెప్పారు. ‘ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాల విూదుగా హైవే వెళ్తునందున బైపాస్‌ రోడ్డు నిర్మించాలని కోరాం. ఖమ్మం చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు చేశాం. గత ప్రభుత్వం రూ.180 కోట్లు కేటాయించలేక రింగ్‌రోడ్డును పక్కన పెట్టేసింది. భద్రాచలం పట్టణంలోనూ కొన్ని రోడ్ల విస్తరణకు ఆమోదం లభించింది. భద్రాచలం నుంచి ఏటూరు నాగారం వరకు.. జగ్గయ్యపేట నుంచి వైరా, తల్లాడ విూదుగా కొత్తగూడెం వరకు 4 లైన్ల హైవేకి ప్రతిపాదనలు పంపించాం‘ అని మంత్రి తెలిపారు. కోదాడ`ఖమ్మం మధ్య రూ.1.039 కోట్లతో నిర్మించిన 32 కి.విూ రహదారి ఆగస్టు 30 కల్లా అందుబాటులోకి వస్తుందన్నారు. ఖమ్మం`కొరివి మధ్య రూ.445 కోట్లతో 37 కి.విూ రహదారి నిర్మాణానికి గతంలోనే అనుమతులిచ్చామని తెలిపారు. దీని నిర్మాణానికి మరో రెండేళ్లు పడుతుందని వెల్లడిరచారు.