ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ హీరో

ఎడపల్లి, (జనంసాక్షి) : ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంతో పాటు రానున్న కాలంలో ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగ, మాదిగ ఉప కులాలు ఎంతో లబ్ధి పొందుతాయని ఇందుకు కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ హీరోనని మాదిగ రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు డల్లా సురేష్ మాదిగ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఎడపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నేటి నుండి అమలు కానున్న ఎస్సీ వర్గీకరణను పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ అమలుతో దళిత జాతిలోని నేటి విద్యార్థులే రేపటి పౌరులుగా ఎదగడానికి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు సంపూర్ణ అవకాశాలు ఉంటాయన్నారు. ఈ దేశంలోనే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంటుందని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన రేవంత్ రెడ్డి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఎస్సీ రిజర్వేషన్లు అమలుకై గెజిట్ విడుదల చేయడం యావత్ మాదిగ జాతే కాదు దళిత జాతి కూడా హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. అదే సమయంలో 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణకై పోరాడుతున్న ఎంఆర్పిఎస్ ఆకాంక్షలను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చడంతో ఎస్సీలలో ఉన్న అన్ని కులాలు నేటి నుండి ఎలాంటి విభేదాలు లేకుండా ఐక్యమత్యంగా ఉండడానికి దారితీస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. దళితులకు రిజర్వేషన్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కల్పించిందని నేడు దళితులలో ఉన్న ఉమ్మడి రిజర్వేషన్లు వర్గీకరణను నేడు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి నిరూపించి మాదిగల రియల్ హీరో అయ్యాడని అన్నారు. ఇందుకు యావత్ దళిత జాతి అంతా సీఎం రేవంత్ రెడ్డికి అండగా ఉండాల్సిన అవసరం ఉందని రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీతోనే దళితుల సమగ్ర అభివృద్ధి ఉంటుందని పూర్తి విశ్వాసంతో ఉన్నామన్నారు. ఒకపక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర ప్రభుత్వం, 30 ఏళ్ల పోరాట నేపథ్యమున్న ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ద్వారా తీర్పు ఇవ్వడం అంటే మళ్ళీ ఎస్సీ వర్గీకరణ సమస్యపై పేచి పెట్టడమే అని మాదిగ జాతి మర్చిపోవద్దన్నారు. దేశంలోనే అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడం లేదో మాదిగ ఉద్యమ నాయకత్వం ప్రశ్నించాల్సింది పోయి ఎస్సి రిజర్వేషన్ వర్గీకరణను అమలు చేసిన రేవంత్ రెడ్డిని బదలాం చేయడం సరికాదన్నారు. మాదిగ జాతి చిన్నారుల భవిష్యత్తుకు పునాది వేసిన తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి డల్లా సురేష్ మాదిగ మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు.

తాజావార్తలు