ముఖ్యమంత్రి సహాయ నిధి
గుర్రంపోడు (జనంసాక్షి): నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం ములకలపల్లి గ్రామపంచాయతీ లో శుక్రవారం సీఎం సహాయ నిధి చెక్కును ములకలపల్లి గ్రామపంచాయతీకి చెందిన పగిళ్ల ఆంజనేయులుకు ,13000 చెక్కు ఎర్ర మద ఉపేందర్ రెడ్డికి, 28000 వేల చెక్కు ను ములకలపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మండలి లింగయ్య యాదవ్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి లింగయ్య, మాజీ ఉపసర్పంచ్ తిరుమల రేణుక భూపాల్ , కాంగ్రెస్ పార్టీ గ్రామ గౌరవ అధ్యక్షులు రెడ్డి రెడ్డి రామిరెడ్డి, పూల యాదయ్య, చిలువేరు సర్వీసులు,మండలి ఊశయ్య, సిలువేరు మల్లయ్య, పగిళ్ల చంద్రయ్య, పూల సత్యనారాయణ, దక్షిణాచారి, పాల్గొన్నారు.