తహసిల్దార్ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు

మంథని, (జనంసాక్షి) : ఈ వేసవి కాలంలో తాసిల్దార్ కార్యాలయంకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తహసిల్దార్ ఎం. వాసంతి అన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం చలివేంద్రాన్ని తహసిల్దార్ ఎం వాసంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. . కార్యాలయానికి వచ్చి వెళ్లే ప్రజల కొరకు చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. వేసవిలో తీవ్ర ఎండలు ఉండడంతో దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి కార్యాలయంలోనే చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ స్రవంతి ,సీనియర్ అసిస్టెంట్ సతీష్, సిబ్బంది శ్రీనివాస్, ప్రదీప్, రజిత, పాల్గొన్నారు.

తాజావార్తలు