జూబ్లీహిల్స్‌లో కొనసాగుతున్న కౌంటింగ్

నవంబర్ 134(జనంసాక్షి)హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 101 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. అనంతరం షేక్‌పేట డివిజన్ ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపునకు మొత్తం 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 10 రౌండ్లలో ఫలితం తేలనుంది. ఒక్కో రౌండ్‌కు 40 నిమిషాలు పట్టనుంది. మధ్యాహ్నం 2 గంటలకల్లా తుది ఫలితం వెలువడనుంది. అయితే 10 గంటల వరకు ఫలితంపై ఒక స్పష్టత రానుంది.
ఈ నెల 11న జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 48.49 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 1,94,631 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 99,771 మంది పురుషులు, 94,855 మంది మహిళలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. బోరబండ్ డివిజన్‌లో 29,760 మంది ఓట్లు వేయగా, రహమత్‌నగర్ డివిజన్‌లో 40,610 ఓట్లు పోలయ్యాయి. ఇక ఎర్రగడ్డ డివిజన్‌లో 29,112 ఓట్లు, వెంగళరావ్‌నగర్‌లో 25,195 ఓట్లు, షేక్‌పేట డివిజన్‌లో 31,182 ఓట్లు, యూసఫ్‌గూడలో 24,219 ఓట్లు, సోమాజిగూడలో 14,553 ఓట్లు పోలయ్యాయి.
కాగా, గెలుపుపై బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ధీమా వ్యక్తం చేశారు. మంచి మెజార్టీతో విజయం సాధిస్తామని తెలిపారు. న్యాయం గెలుస్తుందని చెప్పారు.



