స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి జాతరలో, ఉత్సాహంగా,సందెపు రాళ్ళ, పోటీలు

కృష్ణ,(జనంసాక్షి): మండలం గుడేబల్లూర్ గ్రామం, స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి, జాతర సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో సోమవారం ఉత్సాహంగా, సందెపురాళ్ళ (చేతితో రాయి) ఎత్తే పోటీలు ఘనంగా జరిగాయి, జాతరకు వచ్చిన వివిధ గ్రామాల భక్తులు, పోటీ పడి ఈ పోటీలలో,మొదటి బహుమతి నాగం దొడ్డి ప్రతాప్ 115 కేజి, 10 తొలలా వెండి, దేవదాయ శాఖ అధికారి ఈవో శ్యాంసుందర్ చేతుల మీదుగా , రెండో బహుమతి నరసింహ 108 కెజి, 7 తొలలావెండి, చందపూర్ నాగప్ప చేతుల మీదుగా, మూడవ బహుమతి కలిగిరి హనుమంతు 105 కెజి, 5 తొలలా వెండి, వాకిటి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా బహుమతులు అందించారు. ముగ్గురు అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. రాళ్ళను ఎత్తి, ఆకట్టుకున్నారు. సాయంత్రం ప్రారంభమైన ఈ పోటీ‌లు రాత్రంతా కొనసాగింది,ఈ పోటీల్లో సందర్భంగా అనంతరం పెద్దలు మాట్లాడుతూ గుడేబల్లూర్ గ్రామ యువకులు, అన్ని రంగాలలో ముందంజలో ఉండాలన్నారు. మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పెద్దలు కోరారు, మీ తల్లి తండ్రులకు మంచి పేరు, ప్రతిష్టలు, తీసుకోవాలని తెలిపారు. శ్రీవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని పాడి పంటలు బాగా పండాలని, ప్రధాన అర్చకులు , అన్నారు‌.ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామస్తులు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.