కోటి 40 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

హనుమకొండ ప్రతినిధి జనవరి 22 (జనం సాక్షి) :వర్ధన్నపేట నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నేడు 66వ డివిజన్ గాంధీ విగ్రహం సమీపంలో సుమారు రూ. 1 కోటి 20 లక్షల నిధులతో సీసీ రోడ్ & డ్రైనేజ్ నిర్మాణ పనులకు , విజయ గార్డెన్స్ సమీపంలో 14 లక్షల వ్యయంతో పైప్‌లైన్ పనులకు, అలాగే హసన్ పర్తి పెద్ద చెరువు వద్ద రూ. 4.99 లక్షల నిధులతో ఓపెన్ జిమ్ నిర్మాణ పనులకు స్థానిక శాసన సభ్యులు కేఆర్ నాగరాజు నగర మేయర్ గుండు సుధారాణి తో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, స్థానిక డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, ఆత్మకూర్ ఏఎంసి వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి, హాసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, డివిజన్, మండల, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


