సొంత గూటికి చేరిన గజ్జి విష్ణు

 

 

 

 

 

 

పరకాల, డిసెంబర్ 4 (జనం సాక్షి):హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం దామెర మండలం పసరగొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గజ్జి విష్ణు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో తిరిగి గులాబీ గూటికి చేరారు.వారికి పార్టీ కండువాకప్పి మాజీ ఎమ్మెల్యే ఆహ్వానించారు.పార్టీలో చేరిన వారిలో గజ్జి విష్ణుతో పాటు మాజీ సర్పంచ్ గజ్జి సూరయ్య, గజ్జి ప్రతాప్, ప్రేమ్ సాగర్,సుభాష్,విష్ణు,బాబు,ప్రభు, బుస్స ఆనందం,సుధీర్,గోవిందు దేవేందర్,కచ్చకాయల క్రాంతి,మేడిపెల్లి కోటి, శనిగరం రమేష్,గోపాల్,మంద కుమార్,అమ్మ కుమారస్వామి,దామెర రంజిత్,గజ్జి చంద్రపాల్, సిద్దు, అన్న చేరాలుతో పాటు 50 మందికిపైగా చేరారు.పార్టీలోని చేరిన అనంతరం వారు మాట్లాడుతూ..కాంగ్రేస్ ప్రజలను మోసం చేసిందని,ఆ పార్టీ విధివిధానాలు నచ్చకనే ఆ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.
పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉండి కాపాడుకునాటామని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేడిపెల్లి సాంబయ్య,గ్రామ పార్టీ అధ్యక్షులు గజ్జి రాజు,మాజీ ఉప సర్పంచ్ మేడిపెల్లి సంజీవ,మాజీ వార్డు మెంబర్ పోతరాజు రాజు,నాయకులు శనిగరం సంజీవ,దామెర కోర్నెల్,మామిడి రాజు,గజ్జి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.