జడ్చర్లలో ఘనంగా గణనాథుల ప్రతిష్ఠాపన

జడ్చర్ల, సెప్టెంబర్ 15 (జనంసాక్షి): జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని వాడవాడలా వినాయక చవితి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం వివిధ మండపాల్లో గణనాథులను ప్రతిష్ఠించారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ స్వామివారిని కొలువుదీర్చారు. మండపాలను విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించారు. పూజల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. తొమ్మిది రోజులు నిత్య పూజలు, అన్నదానాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.



