వైభవంగా గరుడ స్తంభ ప్రతిష్టాపన – 5 వేల మందికి అన్నదానం

మాడుగులపల్లి, మే 10 (జనం సాక్షి):నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల పరిధిలోని కుక్కడం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయ గరుడ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ వేడుకలో భాగంగా గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత దంపతులు పానగంటి ప్రధమ లక్ష్మి రామాచారి ప్రత్యేక చొరవ తీసుకుని సుమారు 5000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ఆంజనేయస్వామి వారి కృపతో, గరుడ స్తంభ ప్రతిష్టాపన వంటి పవిత్ర కార్యంలో భాగస్వాములు కావడం తమ అదృష్టమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు మండలంలోని వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన భక్తులతో కుక్కడం గ్రామం కిక్కిరిసిపోయింది ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నదాన ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించారు.గ్రామస్తులు, భక్తుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గరుడ స్తంభ ప్రతిష్టాపన జరిగింది పానగంటి దంపతుల సేవా దృక్పథాన్ని గ్రామ పెద్దలు భక్తులు ప్రత్యేకంగా అభినందించారు మండలంలోని వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు గ్రామ అభివృద్ధికి, ఆధ్యాత్మిక చింతనకు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకమని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.