కొండూరులో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

సిరికొండ ఆగస్టు 12(జనం సాక్షి ): హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బుధవారం కొండూరు గ్రామంలో జాతీయ జెండాను ఘనంగా ఎగురవేశారు. బూత్ అధ్యక్షులు అన్నం విజేందర్, కైరి వినోద్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జాతీయ జెండాకు గౌరవం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు చౌటపల్లి ప్రభాకర్, మండల నాయకులు లింబాద్రి, సాయగౌడ్, తలకట్ల గంగారెడ్డి, కనగందుల గోపి, సర్పల్లి తండా ఉప సర్పంచ్ పిట్ల కల్యాణ్, కార్యకర్తలు నిమ్మపల్లి రవి, గిరిరెడ్డి, దరవోయిన మురళి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు