భార్యతో గొడవ.. కనిపించకుండా పోయిన భర్త

బాలానగర్ /ఆగస్టు 08) జనం సాక్షి )! బాలానగర్ మండలం ఉడిత్యాలకు చెందిన ఓ వ్యక్తి కనిపించకుండా పోవడంతో బాలానగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉడిత్యాలకు చెందిన రుక్నొద్దీన్‌కు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లికి చెందిన జరీనా బేగంతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. గత కొంతకాలంగా కుటుంబ విషయాలపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జూలై 31న ఉదయం రుక్నొద్దీన్ ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రుక్నోదిన్ తల్లి జరీనా ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపారు.



