ఇథనాల్‌ ఫ్యాక్టరీని ఎత్తివేయకపోతే తీవ్ర ప్రజా ఆగ్రహం చవిచూడాల్సి వస్తుంది

గద్వాల నడిగడ్డ, నవంబరు1 జనం సాక్షి

బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎస్ రామచంద్ర రెడ్డి
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో నిర్మించబోయే ఇథనాల్‌ ఫ్యాక్టరీ దుష్పరిణామాలు భవిష్యత్‌ తరాలను నాశనం చేస్తాయని అందుకే ఆ కంపెనీని ఎత్తివేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదురుకోవాల్సి వస్తుందని జిల్లా బిజెపి అధ్యక్షుడు ఎస్. రామచంద్ర రెడ్డి అన్నారు.
శుక్రవారం గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో విలేకరుల సమావేశంలో రామచంద్ర రెడ్డి మాట్లాడుతూఅధికారులకు లంచాలు ఇచ్చి తప్పుదోవ పట్టించి వ్యవసాయ యోగ్యమైన భూముల్లో ఫ్యాక్టరీ తెచ్చుకున్నారని, ఇక్కడున్నవి చక్కటి నల్ల రేగడి భూములని, చిన్న ధన్వాడకు, పెద్ద ధన్వాడకు కిలోమీటర్‌, రెండు కిలోమీటర్ల దూరం లోనే ఉన్నాయని, జనావాసాల మధ్య ఫ్యాక్టరీ వేయడం పర్యావరణానికి వ్యతిరేకమని, మనుషుల సంచారం, జంతు జీవజాలం లేనిచోట ఈ ఫ్యాక్టరీలను వేసుకోవాలని,20 కిలోమీటర్ల దూరం లో ఎలాంటి ఊర్లు ఉండకూడదని, ప్రస్తుతం ఇక్కడి ఊర్లన్నీ తుంగభద్ర నీటిపై ఆధారపడ్డాయని,కింద తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నీళ్లు కూడా లేకుండా పోతాయని, ఫ్యాక్టరీ ఏర్పాటైతే మనుషులకు కాన్సర్, ఊపిరితిత్తులు పాడావుతావి, చర్మరోగాలు, సంతానలేమి, జెన్యూపరమైన రోగాలు,అదేవిధంగా ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలు తుంగభద్రలో కలిపితే పది, పదిహేను పల్లెల్లో తాగునీరు దొరకదని,ప్రధానంగా అలంపూర్‌ పరివాహక ప్రాంతాల్లో కూడా పదుల సంఖ్యల్లో గ్రామాలకు తుంగభద్ర నుంచి తాగునీరు అందుతోందని, సుంకేశుల వద్ద కెసి కెనాల్‌లోనూ ఈ వ్యర్థాలు కలిపే అవకాశముందని, ఈ కెసి కెనాల్‌ వాటర్‌ను డ్రికింగ్‌ వాటర్‌గా చాలాచోట్ల వినియోగిస్తున్నారని, జలశయాలు కూడా నింపుకుంటున్నారని, తెలంగాణతో పాటు కర్నూల్‌, కడప ఈ రెండు జిల్లాలకు కూడా ఫ్యాక్టరీ వల్ల ప్రమాదం ఉంటుందని, తుంగభద్ర కృష్ణ నదికి ఉపనదని, సంగమేశ్వర వద్ద తుంగభద్ర నీళ్లు కూడా కృష్ణా నదిలో కలిసిపోతాయని, దీంతో మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో నీటి కలుషితం ఏర్పడుతుందని, రాబోయే రోజుల్లో సమాజం మొత్తం సోలార్‌ వైపు వెళ్లే అవకాశాలున్నాయని, దీంతో పెట్రోల్‌, డీజీల్‌ వినియోగాలు కూడా తగ్గిపోతాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వల్ల దేశానికిగానీ, ప్రజలకుగానీ ఎలాంటి ఉపయోగం ఉండదని, ఫ్యాక్టరీ ప్రారంభ దశలో ఉంది కాబట్టి పూర్తిగా నిలిపివేయాలని, ఇక్కడి నుంచి ఎత్తివేయాలి లేకపోతే తీవ్ర ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని, ఈ విషయంలో ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కూడా హెచ్చరిస్తున్నారు.
ఈ కార్యక్రమం లో ఓబీసీ జిల్లా అధ్యక్షులు దేవదాస్,రాజోలి మండలం బీజేపీ అధ్యక్షులు సంజీవరెడ్డి, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ గవ్వల శ్రీనివాసులు, డబ్ల్యూ.నర్సింహా, సిద్దార్థ,హేమంత్,తేజ, నవీన్ శెట్టి,గీతరెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.