ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ

మల్లాపూర్ జూలై17 (జనంసాక్షి): మండలంలోని సాతారం ప్రాథమిక పాఠశాలలో మండల రెవెన్యూ అధికారులు మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ ఆధ్వర్యంలో రేవెన్యూ అధికారులు పాఠశాలలో తనిఖీ చేసి మరింత నాణ్యమైనా భోజనం అందించాలని నిర్వాహకులకు సూచన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ప్రధానోపాధ్యాయులు భూమేశ్వర్ ఉపాధ్యాయులు ఉన్నారు.



