ఐ టి సి క్యాజువల్స్ కు అనాదిగా అన్యాయం జరుగుతుంది

బూర్గంపహాడ్ జనవరి 05 (జనంసాక్షి)
బాధితుడుకి పరామర్శ.
మాజీ సర్పంచ్ ధరావత్ చందు నాయక్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం పారిశ్రామిక ప్రాంతమైన సారపాక ఐ టి సి కర్మాగరంలో గాయపడిన బాధితుడిని పరామర్శించిన సారపాక మాజీ సర్పంచ్ ధరావత్ చందు నాయక్ కర్మగారంలో పనిచేస్తున్న క్యాజువల్ కార్మికులకు అనాదిగా అన్యాయం జరుగుతుందన్నారు. ఆదివారం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్యాజువల్ కార్మికుడిని సారపాక మాజీ సర్పంచ్ ధరావత్ చందు నాయక్ పరామర్శించారు. రోజువారీ విధుల్లో భాగంగా కర్మాగారంలో వన్ ఏ మిషన్లో రివైండర్ వద్ద పేపర్ రీల్స్ కట్ చేస్తుండగా బత్తుల కిషోర్ కు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ ధరావత్ చందు నాయక్ ఆసుపత్రికి వెళ్లి బాధితుని పరామర్శించి జరిగిన ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, గాయపడిన బత్తుల కిషోర్ కు కంపెనీ నుండి అన్ని రకాల న్యాయం జరిగేలా కంపెనీ పై ఒత్తిడి తెచ్చి అతని కి న్యాయం జరిగేలా చేస్తానని అన్నారు. క్యాజువల్స్ కు అనాదిగా జరుగుతున్న ఈ అన్యాయంపై వారికి తోడుగా ఉండి, ఎంప్లాయిస్ యూనియన్స్ తో సంబంధం లేకుండా క్యాజువల్స్ అగ్రిమెంట్ నేరుగా కంపెనీ యాజమాన్యం క్యాజువల్ జె. ఎ. సి తో సంప్రదించి, వారి న్యాయపరమైన కోర్కెలు తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట దాసరి సాంబయ్య, రఘు, సురేష్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.


