మరోసారి సత్తాచాటిన ‘జనంసాక్షి’ సర్వే సంస్థ
హైదరాబాద్ : విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన ‘జనంసాక్షి’ సర్వే సంస్థ మరోసారి సత్తాచాటింది. క్షేత్రస్థాయిలో పర్యటించి బ్యాలెట్ పత్రాల్లో నిక్షిప్తంచేసిన ఫలితాలకనుగుణంగా తెలంగాణ లోక్‌సభ స్థానాల్లో ఆయా పార్టీలు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో వేలాది శాంపిల్స్ సేకరించి 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో (మొత్తం 3 లక్షల వరకు..) శాంపిల్స్ తీసుకున్న జనంసాక్షి బృందం.. తదనంతరం వాటిని విశ్లేషించి ఫలితాలను నిక్షిప్తం చేసింది. ఫలితాల గ్రాఫ్‌ను రూపొందించి మొత్తం ఏయే పార్టీకి ఎంత శాతం గెలుపు సూచనలున్నాయో పసిగట్టింది. అదేవిధంగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ‘జనంసాక్షి’ ముందే విశ్లేషించడం గమనార్హం. దీంతో జనంసాక్షి సర్వేకు మరింత ఆదరణ పెరగిందని విశ్లేషకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. నిక్షిప్తం చేసి రూపొందించిన ఈ ఫలితాల నిష్పత్తి (గ్రాఫ్)ని జనంసాక్షి రేపటి ప్రధాన సంచికలో విడుదల చేయనుంది.