చక్రం తిప్పుతున్న జీవన్ రెడ్డి
అధికార పార్టీకి ధీటుగా టిఆర్ఎస్ పార్టీలో చేరికలు.
ఆర్మూర్, జనవరి 28 ( జనంసాక్షి):అసలైన అభ్యర్థులను అధికార పార్టీకి ధీటుగా బిఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుపుతూ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు. వ్యూహ ప్రతి వ్యూహాలను ఎవరికి అర్థం కాకుండా తన చతురతను కనబరుస్తున్నారు.గత 10 ఏళ్లు కేసీఆర్, కేటీఆర్ వెంట కుటుంబ సభ్యుడిగా ఉండి పావులు కదపడం,పనితీరులో శభాష్ అని చాలాసార్లు అనిపించుకున్నాడు.ఈసారి మున్సిపల్ ఎన్నికలను మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చాలెంజ్ గా తీసుకున్నారటా..! కాంగ్రెస్,బిజెపి పార్టీల అభ్యర్థులకు పోటీగా దేనికైనా రెడీ అనేంతగా అభ్యర్థులను బరిలో దించుతున్నారని సమాచారం.గతంలో ఇతర పార్టీల నుండి గెలిచిన కౌన్సిలర్లు,వేరే పార్టీ నుండి పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులను జీవన్ రెడ్డి ముందే పసిగట్టేస్తున్నారు.ముఖ్యంగా యువతను, మైనారిటీలను, వార్డు వారిగా ప్రజలను కలుస్తూ మమేకమై తిరుగుతున్నారు.ఇతర పార్టీల నేతలు తమ అధిష్టానం వైపు చూస్తుంటే, జీవన్ రెడ్డి మాత్రం గెలుపు గుర్రాలను పకడ్బందీగా పట్టుకొని గాలం వేస్తున్నారని తెలిసింది.బిఆర్ఎస్ పార్టీ జోరు మరి మున్సిపల్ ఎన్నికల్లో ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.



