షకీల్ ను పరామర్శించిన కేటీఆర్
బోధన్, (జనంసాక్షి) : బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్, ఆయన సతీమణి ఆయేషా ఫాతీమాను బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. షకీల్ తల్లి షగుప్తా ఆదీబ్ మరణించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షకీల్ ఆమెర్ స్వగృహంలో షకీల్ ఆమెర్ దంపతులను పరామర్శించారు. కేటీఆర్ వెంట ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు.