శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో కుంకుమార్చన

ఎడపల్లి, (జనంసాక్షి) : ఎడపల్లి మండల కేంద్రంలోని నయాబాది శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం శ్రీ ఆదిశంకరాచార్య భగవాన్ నామ సంకీర్తన మండలి ఆధ్వర్యంలో సామూహిక లలితా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమమును ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆదిశంకరాచార్య శిష్య బృందం ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమాన్ని మంత్రోచ్ఛరణల మధ్య సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో సాంప్రదాయ చీరలు ధరించి రేణుక ఎల్లమ్మ ఆలయంకు చేరుకొని శ్రీ ఆది శంకరాచార్య భగవాన్ నిర్వాహకులు అందించిన కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేడిపల్లి గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు నటరాజ్ గౌడ్ మాట్లాడుతూ, అమ్మ దయ ప్రతి ఒక్కరిపై ఉండాలని అందులో భాగంగా శ్రీ ఆదిశంకరాచార్య భగవాన్ నామ సంకీర్తన ఆధ్వర్యంలో నిర్వహించిన కుంకుమ అర్చన కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం ఆనందదాయకమని స్పష్టం చేశారు. ఈ పూజ ద్వారా వారి కుటుంబాలలో సుఖ సంతోషాలు కలగడంతో పాటు గ్రామం సైతం అభివృద్ధి బాటలో పయనిస్తుందని నటరాజ్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ మాణిక్ రజిత యాదవ్, గౌడ సంఘం ఎడపల్లి గ్రామ అధ్యక్షులు నటరాజ్ గౌడ్, ప్రతినిధులు ఆర్ ఎల్లాగౌడ్, కేసరి నాగగౌడ్, కేసరి రమణ గౌడ్, మల్లాగౌడ్ తో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తాజావార్తలు