కార్మిక, రైతాంగ పోరాటాలను తీవ్రం చేద్దాం

 

 

 

 

 

 

పోచంపల్లిలో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఘనంగా 140వ మే డే వేడుకలు

భూదాన్ పోచంపల్లి, మే 5 (జనం సాక్షి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై పోరాటాలను తీవ్రతరం చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు మామిడాల బిక్షపతి పిలుపునిచ్చారు. సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం భూదాన్ పోచంపల్లి పట్టణం, దంతూరు గ్రామాల్లో 140వ మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోచంపల్లిలో పట్టణ కార్యదర్శి పగడాల శివ, దంతూరులో గ్రామ కార్యదర్శి గోరుగంటి ముత్యాలు జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల కార్మికులు, రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, కార్మిక చట్టాల రద్దు, లేబర్ కోడ్ల అమలు ద్వారా శ్రమదోపిడీ పెరుగుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్. జనార్ధన్, ఆర్. సీత, కళ్లెపు అడివయ్య, చిరబోయిన కొమురయ్య, వంగాల నరసింహారెడ్డి, ఉచ్చంతల మల్లేష్, పోతగల్ల నరసింహ, కొత్త బాబు, రచ్చ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు