ప్రాణాలను కబళించే రాకాసి ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు

 

ప్రాణాలను కబళించే రాకాసి ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు. జోగులాంబ గద్వాల (జనం సాక్షి); పెద్ద ధన్వాడ గ్రామంలో ఈతనల్ ఫ్యాక్టరీకి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనావాసాల మధ్య ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఫ్యాక్టరీ నుండి వెలువడే వ్యర్ధాల వల్ల గాలి నీరు భూమి కలుషితమై పంటలు పండక, క్యాన్సర్ కారక వాయువులు వెలువడి మానవ మనుగడ ప్రశ్నార్ధకంగా మారి పంట పొలాలను, పల్లెలను వదిలి వలసలు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చని పంటలు పండిస్తూ సంతోషంగా జీవిస్తున్న కుటుంబాల్లో ఫ్యాక్టరీ వచ్చి అంధకారాన్ని నింపుతుందని, రైతులకు మద్దతుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ,ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు పలికారు.